Share News

మల్లన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు

ABN , Publish Date - May 27 , 2025 | 11:38 PM

శ్రీశైలం దేవస్ధానంలోని హుండీల లెక్కింపు మంగళవారం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు

మల్లన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు
హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న శివసేవకులు, ఆలయ సిబ్బంది

నంద్యాల కల్చరల్‌, మే 27(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్ధానంలోని హుండీల లెక్కింపు మంగళవారం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీలను లెక్కించగా గత 28 రోజులకు గాను రూ.3,74,99,234 వచ్చినట్లు ఈవో తెలిపారు. అలాగే హుండీలో 120.10 గ్రాముల బంగారు, 4.26 కిలోల వెండి లభించాయన్నారు. అదే విధంగా 377 యూఎ్‌సఏ డాలర్లు, 25 సింగపూర్‌ డాలర్లు, 10 కెనడా డాలర్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 200 యూకే పౌండ్స్‌, 30 ఈరోస్‌, 21 కువైట్‌ దినార్‌, వెయ్యి వియత్నాం డాంగ్స్‌, 44 మలేషియా రింగిట్స్‌, వెయ్యి జపాన్‌ ఎన్స్‌, 10 మాల్దీవుల రుఫియాస్‌ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీలో లభించాయన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఈవో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రమణమ్మ, పలు విభాగాల అధికారులు, శివసేవకులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:38 PM