Share News

యోగాంధ్రను విజయవంతం చేయండి

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:16 AM

యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డ్వామా పీడీ రమణయ్య పిలుపునిచ్చారు.

యోగాంధ్రను విజయవంతం చేయండి
మాట్లాడుతున్న డ్వామా పీడీ రమణయ్య

ఓర్వకల్లు, జూన 19(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డ్వామా పీడీ రమణయ్య పిలుపునిచ్చారు. గురువారం ఓర్వకల్లులోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన విలేకరు లతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్స వం పురస్కరించుకుని ఈనెల 21న యోగా కార్యక్రమాలపై ఆయా శాఖాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. యోగా కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి ప్రజ లు, అధికారులు, ప్రజాప్రతినిదులు, స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో యోగాపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:16 AM