యూరియా కొరతలేకుండా చూడండి
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:20 PM
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కలెక్టర్ రాజకుమారికి సూచించారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కలెక్టర్ రాజకుమారికి సూచించారు. మంగళవారం బొమ్మలసత్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి యూరియా కొరతపై కలెక్టర్‌తో చర్చించారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ పంటలకు అవసరమైన మేరకు యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు కూడా యూరియా వాడకం, నిల్వలపై అవగాహన కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా మంత్రి బీసీ మాట్లాడుతూ రైతులు తమ పంటలకు సరిపడా యూరియాను మాత్రమే తీసుకోవాలని, కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో అధిక మోతాదులో యూరియా కొనుగోలు చేయవద్దని కోరారు.