Share News

టీడీఆర్‌ బాండ్ల జారీ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:11 AM

నగరంలోని కిడ్స్‌ వరల్డ్‌ నుంచి బుధవారపేట వంతెన వరకు చేయనున్న రహదారి విస్తరణ పనులకు సంబంధించి బాధిత యజమానులకు టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆదేశించారు

టీడీఆర్‌ బాండ్ల జారీ వేగవంతం చేయాలి
పట్టణ ప్రణాళిక అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌

నగర పాలక కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): నగరంలోని కిడ్స్‌ వరల్డ్‌ నుంచి బుధవారపేట వంతెన వరకు చేయనున్న రహదారి విస్తరణ పనులకు సంబంధించి బాధిత యజమానులకు టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆదేశించారు. మంగళవారం ఉస్మానియా కళావాల, వడ్డేగేరి ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు సంబంధించిన కొలతలను కమిషనర్‌ పరిశీలించారు. నగరాభివృద్ధిలో భాగంగా చేస్తున్న రహదారుల విస్తరణను ఆలస్యం లేకుండా ప్రారంభించాలన్నారు. బాండ్ల మంజూరులో పారదర్శకత, వేగం ఉండాలని సూచించారు. రహదారి రహదారుల విస్తరణతో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గడంతో పాటు నగరవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. టీపీవో అంజాద్‌బాషా, బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్లు వేమన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:11 AM