లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:40 PM
దేశ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి కోరారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి
కర్నూలు లీగల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి కోరారు. స్థానిక జిల్లా కోర్టు హాలులో పీపీలు, ఏపీపీలు, జీపీలు బీమా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మోటారు వాహనాల ప్రమాదాల కేసులు, సివిల్ కేసులు, భూసేకరణ కేసులు, బ్యాంకు, చిట్‌ఫండ్ వివాదాల కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. రాజీకి వీలున్న క్రిమినల్ కేసులే గాక ప్రిలిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారానికి పలు బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, కర్నూలు డిపో మేనేజర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.