లోక్ అదాలతను విజయవంతం చేయండి
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:02 AM
జాతీయ లోక్ అదాలత ఈనెల 13న నిర్వహించనున్నామని, విజయవంతం చేయాలని నందికొట్కూరు సివిల్ న్యాయాధికారి శోభారాణి అధికారులను ఆదేశించారు.
నందికొట్కూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్ అదాలత ఈనెల 13న నిర్వహించనున్నామని, విజయవంతం చేయాలని నందికొట్కూరు సివిల్ న్యాయాధికారి శోభారాణి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కోర్టు ఆవరణలో ఈనెల 13న జరిగే పోలీసు అధికా రులు, బార్ అసోసియేషన న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కక్షిదారులకు అవగాహన కల్పించి లోక్ అదాలత ద్వారా అప్పీల్‌లేని తీర్పును పొందవచ్చన్నారు. ముఖ్యంగా న్యాయవాదులు, పోలీసు అధికారుల సహకారం లేనిదే ఈ కార్యక్రమం విజయవంతం కాదని, అందుకే అందరి సహకారం అందిం చాలని కోరారు. జూనియర్ సివిల్ న్యాయాధికారి రాహుల్ అంబేడ్కర్ మా ట్లాడుతూ రాజీకి అర్హుమైన సివిల్, క్రిమినల్ తగాదాలను పరిష్క రిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన అధ్యక్షుడు శరభయ్య, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.