గృహాలను నివాసయోగ్యంగా తీర్చిదిద్దండి
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:33 PM
దేవస్థాన అధికారులు సిబ్బం ది కోసం నిర్మించిన బహుళ అంతస్థుల గృహాలను నివాసయోగ్యంగా తీర్చిది ద్దాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు.
దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్
శ్రీశైలం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దేవస్థాన అధికారులు సిబ్బం ది కోసం నిర్మించిన బహుళ అంతస్థుల గృహాలను నివాసయోగ్యంగా తీర్చిది ద్దాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. బుధ వారం శ్రీశైలం ప్రాజెక్ట్ సుండిపెంటలోని వసతిగృహ సముదాయలను ఆయ న పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వసతి సముదా యా ల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, వాహనాల పార్కింగ్, వీధిలైట్లు త్వరిత గతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహ్లదకర వాతావరణం కోసం విరివిగా పలు రకాల మొక్కలు పెంచాలని, ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మిం చాలన్నారు. మొత్తం మూడు నమూనాల్లో 297 గృహలను సిబ్బందికి కేటా యించేందుకు సిద్ధంగా ఈఈ నర్సింహరెడ్డి తెలిపారు. కమి షనర్ వెంట చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్ శేఖర్, స్థపతి పరమేశ్వరప్ప, శిల్పవి భాగపు సల హా దారు సుందర్‌రాజన్, దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది ఉన్నారు.