Share News

అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:53 PM

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ రాజకుమారి ఎంపీడీఓలు, సర్పంచ్‌లను ఆదేశించారు.

అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ రాజకుమారి ఎంపీడీఓలు, సర్పంచ్‌లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌హాల్‌లో ఆదర్శగ్రామాల అభివృద్ధిపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఎంపికైన 19 గ్రామాల్లో అభివృద్ధిపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి ఏడాది గ్రామాల అభివృద్ధికి రూ.20లక్షలు మంజూరు చేయడంతోపాటు అదనంగా అడ్మిన్‌ కాస్ట్‌ పరంగా రూ.లక్ష ఇస్తామన్నారు. సీసీ, బీటీరోడ్లకు అధిక ప్రాధాన్యమివ్వాలని, గ్రామంలో పది, ఐటీఐ, డిప్లమో చదివినవారు ఎంతమంది ఉన్నారో గుర్తించి వారినైపుణ్యాభివృద్ధికి స్కిల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం కల్పించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఈవో సుబ్బారెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి చింతామణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:53 PM