‘చలో సిద్ధేశ్వరం’ను జయప్రదం చేయండి
ABN , Publish Date - May 31 , 2025 | 12:26 AM
చలో సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన కమిటీ జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి కోరారు.
రాయలసీమ సాగునీటి సాధన కమిటీ జేఏసీ అధ్యక్షుడు
ఎమ్మిగనూరు టౌన, మే 30 (ఆంధ్రజ్యోతి) : చలో సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన కమిటీ జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో సత్యనారాయణ రెడ్డి, నాగన్న మాట్లాడుతూ శనివారం సిద్ధేశ్వరంలో నిర్వహిస్తున్న రామలసీమ సాగునీటి సాధన 9వ వార్షిక మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదని, అందులో రాయలసీమ కూడా ఒక భాగమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించా లని అన్నారు. సిద్ధేశ్వరం అలుగు, పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు పూ ర్తయితే రాయలసీమ కరువు నుంచి విముక్తి పొందుతుంద న్నారు. సభలో రైతులు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో నర్సప్ప, బతకన్న, నేపాల్, రఘు, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.