Share News

రికార్డులు సక్రమంగా నిర్వహించండి

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:40 PM

మద్యం డిపోలో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అక్కడి సిబ్బందిని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి ఆదేశించారు.

రికార్డులు సక్రమంగా నిర్వహించండి
మద్యం డిపోలో తనిఖీ చేస్తున్న ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌

ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి

నంద్యాల టౌన్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మద్యం డిపోలో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అక్కడి సిబ్బందిని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి ఆదేశించారు. పట్టణంలోని ఆటోనగర్‌లో ఉన్న మద్యం డిపోను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ మొంథా తుఫాన్‌ కారణంగా జిల్లాలో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నందున మద్యం డిపోలో సీలింగ్‌ జరిగిందా లేదా అని పరిశీలించారు. అన్నిరకాల బ్రాండ్ల అమ్మకాలు ఎలా ఉన్నాయని సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. ఎక్కడా కూడా లెక్కల్లో తారతమ్యం లేకుండా రికార్డులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. రికార్డులు పరిశీలించి అమ్మకాల వివరాలు అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ నగేశ్‌కుమార్‌, ఎక్సైజ్‌ సూపర్‌వైజర్‌ అధికారి కోటారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ కృష్ణానాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 11:40 PM