రికార్డులు సక్రమంగా ఉంచాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:31 AM
వక్ఫ్ సంస్థల ఆస్తుల వివరాల రికార్డులను సక్రమంగా ఉంచాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ ఆలీ అన్నారు
రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ ఆలీ
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ సంస్థల ఆస్తుల వివరాల రికార్డులను సక్రమంగా ఉంచాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ ఆలీ అన్నారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఉమ్మడి జిల్లాల ముతవల్లీలతో శనివారం సమావేశమ య్యారు. వక్ఫ్‌బోర్డు కేవలం 7శాతం ఆదాయం మాత్రమే నిధులుగా సేకరిస్తుందని, మిగిలిన 93 శాతం ఆదాయాన్ని వక్ఫ్ డీడ్‌ల ప్రకారం పేదల సంక్షేమం, విద్యారంగం కోసం వినియోగించాలన్నారు. కానీ అనేక సంస్థలు నిబంధనలను పాటించడం లేదన్నారు. అనంతరం ఉమ్మీద్ పోర్టల్‌పై అవగాహన కల్పించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సయ్యద్ సబీహా పార్వీన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో వక్ఫ్ సంస్థలు ఉన్నాయని, వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో 300 మంది ముతవల్లీలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.