Share News

పరిసరాల శుభ్రత పాటించాలి

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:57 AM

ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు అన్నారు.

పరిసరాల శుభ్రత పాటించాలి
కర్నూలు జీజీహెచలో మొక్క నాటుతున్న సూపరింటెండెంట్‌

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ డ్రైనేజీల శుభ్రం, నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో మురుగునీరు తొలగించాలని, ఆసుపత్రిలో పారి శుధ్యంపై పెస్ట్‌ కంట్రోల్‌ సిబ్బంది దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం పెయింగ్‌ బ్లాక్‌ దగ్గర మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ సూప రింటెండెంట్‌ డాక్టర్‌ డి.శ్రీరాములు, సీఎస్‌ఆర్‌ఎంవో డా.వెంకటరమణ, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో డా.పద్మజ పాల్గొన్నారు.

కర్నూలు మెడికల్‌ కాలేజీలో: కర్నూలు మెడికల్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిలో మట్టి, కంకర వేసి పూరించారు. కళాశాలలో ఫాగింగ్‌, యాంటి లార్వా యాక్టివిటీ నిర్వహించి ప్రిన్సిపాల్‌ మొక్కలు నాటారు. ర్యాలీ అనంతరం ప్రిన్సిపాల్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌, కమ్యూనిటీ మెడిసిన హెచవోడీ డా.సుధాకుమారి, ప్రొఫెసర్‌ డా.ఎలిజిబెత, ఎనఈఎస్‌ కార్యక్రమం అధికారి డా.అరుణ పాల్గొన్నారు.

జిల్లా వైద్యఆరోగ్య శాఖలో.. జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచవో డాక్టర్‌ పి. శాంతికళ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమం జరిగింది. ముందుగా డీఎంహెచవో ప్రతిజ్ఞ చేయించారు. వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, జాగ్రత్తలు అంశాలపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచవో తెలిపారు. పీహెచసీ, అర్బన హెల్త్‌ సెంటర్లు, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచవో ఆఫీసు పరిపాలన అధికారి కే.అరు ణ, డీఐవో డా.నాగప్రసాద్‌ బాబు, డీపీవో డా.సంద్యారెడ్డి, డెమో శ్రీనివాసుల శెట్టి, ఎస్‌వో హేమసుందరం, డీపీహెచఎనవో శారదామణి పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:57 AM