Share News

సబ్‌ జైలును తనిఖీ చేసిన న్యాయాధికారి

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:25 AM

పట్టణంలోని సబ్‌ జైలు ను సివిల్‌ న్యాయాధికారి టి.భాస్కర్‌ బుధవారం తనిఖీ చేశారు.

సబ్‌ జైలును తనిఖీ చేసిన న్యాయాధికారి
మాట్లాడుతున్న న్యాయాధికారి భాస్కర్‌

ఆళ్లగడ్డ డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సబ్‌ జైలు ను సివిల్‌ న్యాయాధికారి టి.భాస్కర్‌ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌ జైలు పరిసరాలను పరిశీలించి, ఖైదీలతో మాట్లాడారు. జైలులో అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్యానెల్‌ అడ్వకేట్‌ షహీనా బేగం, సుబ్బయ్య, జూనియర్‌ న్యాయవాదులు గణేష్‌, శ్రీనివాసులు, శాస్త్రీ, తాజ్‌బాష, జైలు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 12:25 AM