Share News

దిగువ అహోబిలం హుండీ ఆదాయం రూ.30.90 లక్షలు

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:32 AM

దిగువ అహోబిలంలో బుధవారం లక్ష్మీనరసింహస్వామి హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు.

దిగువ అహోబిలం హుండీ ఆదాయం రూ.30.90 లక్షలు
హుండీ లెక్కిస్తున్న అధికారులు

ఆళ్లగడ్డ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): దిగువ అహోబిలంలో బుధవారం లక్ష్మీనరసింహస్వామి హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. మఠం సీఈఓ సుందర రాజన ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఆలయాలలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా రూ 30,90,084లు ఆదాయం వచ్చినట్లు మఠం అధికారులు తెలిపారు. అలాగే 19 గ్రాముల బంగారం, 800 గ్రాము ల వెండి వచ్చినట్లు తె లిపారు. అలాగే ఎగువ అహోబిలంలో 199 గ్రాముల బంగారం, 3 కేజీల 100 గ్రాముల వెండి వచ్చిందన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:32 AM