విద్యార్థులతో లోకేశ్ మమేకం
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:10 AM
ప్రధాని పర్యటన నిమిత్తం కర్నూలు జిల్లాకు వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కాసేపు మమేకమయ్యారు.
జీఎస్టీ వ్యాసరచన పోటీల్లో విజేతలకు అభినందనలు
విద్యార్థులను అభినందించిన గవర్నర్
కర్నూలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రధాని పర్యటన నిమిత్తం కర్నూలు జిల్లాకు వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కాసేపు మమేకమయ్యారు. ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’పై జిల్లాలో వివిద పాఠశాలల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులను నారా లోకేశ్ అభినందించారు. ఆయనతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా విద్యార్థులను అభినందించారు. గురువారం జీఎస్టీ సభా వేదిక సమీపంలోని క్యాంపులో జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై డ్రాయింగ్, వ్యాసరచన, వకృత్వ పోటీలను నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులు, ఉపాధ్యాయులు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్‌లను కలుసుకున్నారు. వారితో సరదాగా ముచ్చటించిన మంత్రి లోకేశ్ విజేతలను అభినందించారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని కోరారు. విద్యార్థులను కర్నూలు డీఈఓ శామ్యుల్‌పాల్ దగ్గరుండి మంత్రి లోకేశ్‌కు పరిచయం చేయించారు.