సత్వర న్యాయానికి లోక్ అదాలత్
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:14 AM
కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే ధ్యేయంతోనే లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది పేర్కొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది
కర్నూలు లీగల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే ధ్యేయంతోనే లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది పేర్కొన్నారు. శనివారం స్థానిక లోక్ అదాలత్ భవనంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు కొన్నేళ్లుగా పరిష్కారం కాని భూసేకరణ కేసులలో నష్టపరిహారం చెల్లించడానికి ఈ రోజు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. భూములు కోల్పోయిన వారు నష్టపరిహారం సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాదరని, వారికి చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్‌లో 16 బెంచ్‌లను వివిధ న్యాయాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయాధికారులు కమలాదేవి, వాసు, శ్రీవిద్య, అదనపు సబ్ జడ్జీ దివాకర్, జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లుతో పాటు పెద్ద సంఖ్యలో కక్షిదారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.