నాటు కిక్కు
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:49 PM
నియోజకవర్గ కేంద్రం పత్తికొండలో సారా గుప్పుమంటోంది. ఎక్సైజ్ అధికారులు నవోదయం పేరుతో హంగామా చేస్తూ, పట్టించుకోవడం లేదని, పోలీసులు అడ్డుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మద్దికెర, తుగ్గలి మండలాల్లో యథేచ్ఛగా సారా తయారీ
ఫొటోలకే పరిమితమైన నవోదయం
మామూళ్ల మత్తులో ఎక్సైజ్, పోలీసు సిబ్బంది
పత్తికొండ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రం పత్తికొండలో సారా గుప్పుమంటోంది. ఎక్సైజ్ అధికారులు నవోదయం పేరుతో హంగామా చేస్తూ, పట్టించుకోవడం లేదని, పోలీసులు అడ్డుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టణం, పల్లెల్లో యథేచ్ఛగా విక్రయం..
పత్తికొండ పట్టణంతోపాటు మండల కేంద్రాలు పల్లెల్లో సారా విక్రయిస్తుండటంతో మందుబాబులు సారా తాగుతూ చిన్న వవయస్సులోనే కిడ్నీ, లివర్ వ్యాధులతో చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. నాటుసారా వ్యసనానికి బానిసలుగా మారి కుటుంబపెద్దలు మృత్యువాతపడుతుండడంతో ఆకుటుంబాలు వీధినపడుతున్నాయి. మద్దికెర, తుగ్గలిమండలాల్లో తయారీదారులు రైళ్లద్వారా ఇతరజిల్లాలకు నాటుసారాను తరలిస్తుంటారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అఽధికారులు బెల్లంఊటను ధ్వంసం చేసి సారాను వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయొ.
యథేచ్ఛగా తయారీ..
పత్తికొండ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల్లో సారా తయారీకేంద్రాలు ఉన్నాయి. పత్తికొండ మండలం పెండ్లిమాన్‌తండా, మర్రిమాన్‌తాండా, జెఎం తండా, బుగ్గతండా అలాగే తుగ్గలి మండలం జాఫ్లాతండా, గుల్లాలతండా, లక్ష్మీతాండా, రోళ్లపాడు తండా, ఎల్లమ్మగుట్టతండా, సూర్యతండా,, చెరువ ుతండాతోపాటు రాంపల్లి, తుగ్గలి గ్రామాల్లో సారా తయారీకేంద్రాలు ఉన్నాయి. మద్దికెర మండలం మద్దికెర, కొత్తపల్లి, మదనంతపురం, బొల్లవానిపల్లెలతోపాటు మరికొన్ని గ్రామాల్లో నాటుసారా తయారీకేంద్రాలు ఉన్నాయి.
ఇతర జిల్లాలకు సరఫరా..
మద్దికెర మండలంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన కుటుం బాలు దశాబ్ధాలుగా సారా తయారీ ఆధారంగా జీవిస్తున్నారు. వీరు తయారుచేసిన సారాను ఇతర జిల్లాలకు రైలులో తరలిస్తున్నట్లు సమాచారం. తుగ్గలి మండలం రాంపల్లి, తుగ్గలి గ్రామాల తయారీ దారులు రైళ్లలో రవాణా చేస్తున్నారు. తండాల్లో తయారుచేసే సారాను సమీప గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ పాకెట్లలో 400 ఎం.ఎల్. సారాను రూ.50లకు, లీటర్ బాటిల్ రూ.100ల నుంచి రూ. 200 వరకు విక్రయిస్తారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న చీప్ లిక్కర్ కంటె అతి తక్కువ ధరకే దొరుకుతుం డటంతో ఆటోడ్రైవర్లు, మెకానిక్‌లు, కూలీలు సారాతోప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రకటనలకే పరిమితమైన నవోదయం 2.0
సారా నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 ప్రకటల కే పరిమితమైందని విమర్శలు న్నాయి. తయారీదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించకుండా ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు కేవలం ప్రభుత్వానికి నివేదికలు పంపడానికి ఫొటోల కోసమే హంగామా చేస్తున్నట్లు గ్రామస్థులు అంటున్నారు.
దాడులపై ముందస్తు సమాచారం..
సారా స్థావారాలపై దాడులు చేసే సమయంలో కొందరు ఎక్సైజ్ సిబ్బంది సారా తయారీదారులకు ముందస్తు సమాచారం ఇస్తున్నట్లు సమాచారం. దీంతోనే తయారీదారులు దాడులు జరిగే సమయానికి పరారవుతున్నారు. ఎక్సైజ్, పోలీసు అధికారులకు మామూళ్లు అందుతు న్నందునే ఇలా అవుతోందని పలువులు చర్చించుకుంటున్నారు. అధికారులు సారా నిర్మూలనకు కృషి చేయాలని కోరుతున్నారు.
సారా నిర్మూలనకు కృషి చేస్తున్నాం
సారా నిర్మూలనకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. సారా స్థావరాలపై దాడులు చేస్తూ కేసునమోదు చేస్తున్నాం. వీటితో పాటు బైండోవర్ నమోదు చేస్తున్నాం. నవోదయం 2.0 ద్వారా ుసారా తయారీదారుల్లో మార్పుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. - విశ్వేశ్వరరావు, ఎక్సైజ్ సీఐ, పత్తికొండ