డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:37 PM
డ్రగ్ లేని సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.
కర్నూలు న్యూసిటీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): డ్రగ్ లేని సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మంగళశారం నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఉద్యోగులు, సిబ్బందితో మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయిం చారు. కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ గొప్ప ప్రాజెక్టు అని తెలిపారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి దేశాన్ని ప్రగతి వైపు నడిపించాలని సూచించారు. మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డా.నాగశివప్రసాద్, ఆర్‌వో జునైద్, కార్యదర్శి నాగరాజు, సూపరింటెండెంట్ సుబ్బన్న పాల్గొన్నారు.