క్రీస్తు ఆశీర్వాదాలతో సుఖంగా జీవించాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:27 AM
ప్రజలంతా క్రీస్తు ఆశీర్వాదాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఆకాంక్షించారు.
కర్నూలు కల్చరల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలంతా క్రీస్తు ఆశీర్వాదాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఆకాంక్షించారు. మంగళవారం ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక అధ్యక్షుడు రెడ్డిపోగు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో అంబేడర్ భవన్ వద్ద క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, ప్రసంగీకుడు బీఏ ప్రసాదరావు, గుడిపల్లి సురేంద్ర, రోషిగారి ప్రశాక్ మాదిగ, నాయకల్లు సోమసుందరం పాల్గొన్నారు. టీజీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. ఏటా మే 16న తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక వివాహాలు చేసి జంటకు రూ.లక్ష అందజేస్తానన్నారు.