సమాజహితానికి దోహదపడే సాహిత్యం అవసరం
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:03 AM
సమాజ హితానికి దోహదపడే సాహిత్యం నేడు ఎంతో అవసరమని రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య అన్నారు.
రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య
కర్నూలు కల్చరల్, జూన 29(ఆంధ్రజ్యోతి): సమాజ హితానికి దోహదపడే సాహిత్యం నేడు ఎంతో అవసరమని రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య అన్నారు. ఆదివారం నగరంలో మద్దూరునగర్‌లోని పింగళి సూరన తెలుగుతోట సమావేశ హాలులో ప్రముఖ రచయిత్రి, నంద్యాలకు చెందిన భవానీ లీలావతమ్మ స్మృతిపథంలో, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) ముద్రించిన ‘భవ్యభావాల గని-మా భవానీ లీలావతమ్మ’ పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. సాహితీ సదస్సు సాహిత్య సంస్థ, నరసం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభలో తొలుత దివంగత లీలావతమ్మ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జి. పుల్లయ్య పుస్తకాన్ని, ఇతర సాహితీవేత్తలతో కలిసి ఆవిష్కరించారు. జి.పుల్లయ్య మాట్లాడుతూ సాహిత్యకారులు చేసే రచనలు దేశాభి వృద్ధికి ఎంతో దోహదపడతాయన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ లీలావతమ్మ పద్యాల్లో ఎంతో లాలిత్యం ఉంటుందని, ఆమె పద్యాలను ఒకచోట చేర్చి సంకలాన్ని తీసుకురా వడం అభినందనీయమని చెప్పారు. నరసం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కా.వెం.సుబ్బలక్ష్మమ్మ, డాక్టర్ దండెబోయిన పార్వతీదేవిలు మాట్లాడుతూ భవానీ లీలావతమ్మ తెలుగు ఉపాధ్యాయురాలిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారని, ఆమె ప్రమాదవశాత్తు మరణించ డం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో సాహితీ సదస్సు అధ్యక్షుడు కేసీ కల్కూర, ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, భాషావేత్త జేఎస్ ఆర్‌కే శర్మ, కవయిత్రులు పద్మావతి, సునీత, చంద్రమౌళిని, నీలిమ, హైమావతి, రుక్మిణి, సీతామహాలక్ష్మి, లీలావతి కుమారులు రవి, కల్యాణ్ పాల్గొన్నారు.