డీఈవోకు విద్యార్థుల జాబితా
ABN , Publish Date - May 09 , 2025 | 12:25 AM
ఆదర్శపాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థుల జాబితాను మోడల్ స్కూల్స్ నంద్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ ఇష్రత్‌బేగం డీఈవో జనార్ధన్‌రెడ్డికి గురువారం అందజేశారు.
నంద్యాల ఎడ్యుకేషన్, మే 8 (ఆంధ్రజ్యోతి): ఆదర్శపాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థుల జాబితాను మోడల్ స్కూల్స్ నంద్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ ఇష్రత్‌బేగం డీఈవో జనార్ధన్‌రెడ్డికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఇష్రత్ బేగం మాట్లాడుతూ జిల్లాలోని ఇరవై ఆదర్శ పాఠశాలలకు సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులకు రోస్టర్ కం మెరిట్ ఆధారంగా ఎంపిక, పరిశీలన కార్యక్రమం పూర్తిచేశామన్నారు. ఉన్నతాధికారుల అనుమతి కోసం డీఈవోకు పూర్తయిన జాబితాను అందజేసినట్లు తెలిపారు.