Share News

ముట్టడీలా

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:58 PM

వైసీపీ నాయకులు చేపట్టిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ముట్టడి కార్యక్రమం తుస్సుమంది.

ముట్టడీలా
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు కట్టిన వైసీపీ జెండాలు

వంద మంది కూడా హాజరుకాని వైనం

వైసీపీ నాయకుల ఓవరాక్షన్‌

మెడికల్‌ కళాశాలకు వైసీపీ జెండాలు

ఆదోని రూరల్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు చేపట్టిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ముట్టడి కార్యక్రమం తుస్సుమంది. తమ సొంత పార్టీ కార్యాలయం అనుకున్నారో ఏమో నిర్మాణంలో ఉన్న ఆదోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనాల చుట్టూ వైసీపీ జెండాలు కట్టారు. ఈమెడికల్‌ కాలేజీని వైఎస్‌ జగన్‌ కట్టించారని, తమదేనంటూ హల్‌చల్‌ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరేకల్లు సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని వైసీపీ నాయకులు మంగళవారం ము ట్టడించారు. పట్టుమని వంద కూడా హాజరు కాలేదు. చంద్ర బాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడు తూ పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే మెడికల్‌ కళాశాలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి కలుగ చేసుకొని ఎక్కువ అరిస్తే బీపీ వస్తుందనడంతో అక్కడున్న వైసీపీ శ్రేణులు సైలెంట్‌ అయిపోయారు.

Updated Date - Sep 16 , 2025 | 11:58 PM