Share News

భళా.. ఎల్ల లింగ

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:20 AM

మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భళా.. ఎల్ల లింగ
220 కేజీల ఇసుక బస్తాను ఎత్తుతున్న మడినల్‌ ఎల్ల లింగ 175 కేజీల గుండు ఎత్తుతున్న కప్పగల్‌ కర్ణ

220 కేజీల ఇసుక బస్తా ఎత్తిన యువకుడు

175 కేజీల రాతి గుండు ఎత్తిన కప్పగల్‌ కర్ణ

కందుకూరులో బలప్రదర్శన పోటీలు

కోసిగి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏపీతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన గ్రామీణ యువకులు పాల్గొన్నారు. 220 కేజీల ఇసుక బస్తా ఎత్తే పోటీలో కర్ణాటక చెందిన మడినల్‌ ఎల్ల లింగా అనే యువకుడు ఇసుక బస్తాను ఎత్తి విజేతగా నిలిచారు. అలాగే మరియప్ప నాయక్‌ అనే యువకుడు 200 కేజీల ఇసుక బస్తాను ఎత్తి రెండో స్థానంలో నిలిచారు. 175 కేజీల రాతిగుండును కర్ణాటకకు చెందిన కప్పగల్‌ కర్ణ అనే యువకుడు ఎత్తి శభాష్‌ అనిపించుకున్నాడు.

ఏడు కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో పెద్దతుంబళం గ్రామానికి చెందిన ఈరన్న అనే యువకుడు మొదటి స్థానంలో నిలిచాడు. పెద్దతుంబళం గ్రామానికి చెందిన తిమ్మప్ప రెండో స్థానంలో నిలిచాడు. వీరికి మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. బల ప్రదర్శనలు తిలకించేందుకు వేలాది మంది ప్రజలు చూడడానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, ముత్తురెడ్డి, రామిరెడ్డి, నాడిగేని అయ్యన్న, వక్రాణి వెంకటేశ్‌, చిన్న తాయన్న, నర్సారెడ్డి, తోవి రామకృష్ణ, జ్ఞానేష్‌, గాలెం వీరేష్‌ రామిరెడ్డి, కురువ అయ్యన్న, రామలింగ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:20 AM