Share News

సీపీఆర్‌తో ప్రాణం నిలిపారు

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:47 PM

ఆటో బోల్తాపడి స్పృహ కోల్పోయిన ఆటోడ్రైవర్‌కు గ్నిమాపక సిబ్బంది సీపీఆర్‌ చేసి ప్రాణాన్ని కాపాడారు.

సీపీఆర్‌తో ప్రాణం నిలిపారు
సీపీఆర్‌ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కర్నూలు క్రైం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆటో బోల్తాపడి స్పృహ కోల్పోయిన ఆటోడ్రైవర్‌కు గ్నిమాపక సిబ్బంది సీపీఆర్‌ చేసి ప్రాణాన్ని కాపాడారు. వివరాల మేరకు.. చెట్లమల్లాపురం గ్రామానికి ఓ ఆటోడ్రైవర్‌ కర్నూలు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా, ఉలిందకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఫ్లైఓవర్‌ వద్ద ఆటో బోల్తా పడింది. డ్రైవర్‌ స్పృహ కోల్పోగా అనంతపురం వైపు నుంచి వస్తున్న అగ్నిమాకప సిబ్బంది రఘురాముడు, జయరాముడు స్పృహ కోల్పోయిన డ్రైవర్‌కు సీపీఆర్‌ చేయడంతో ఆటో డ్రైవర్‌ స్పృహలోకి వచ్చాడు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్‌ కోలుకుంటున్నాడు.

Updated Date - Nov 23 , 2025 | 11:47 PM