జంట హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు
ABN , Publish Date - May 09 , 2025 | 12:39 AM
ఎనిమిదేళ్ల నాటి జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వైసీపీ నాయకుడు, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త కంగాటి లక్ష్మినారాయణ రెడ్డి అలియాస్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచ ్డరుడు బోయ సాంబశివుడుల జంట హత్యల కేసులో 11 మంది నిందితులపై జీవిత ఖైదు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ కర్నూలు ప్రిన్సిపుల్స్ సెషన్స్ న్యాయాధికారి జి.కబర్ధి గురువారం సంచలన తీర్పు చెప్పారు.
చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకేసు..
నిర్ధోషులుగా ఐదుగురు
రోదనలతో మిన్నంటిన కోర్టు ఆవరణం
హత్య జరిగిన 8 ఏళ్లకు శిక్ష ఖరారు
కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు
కర్నూలు లీగల్, మే 8 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్ల నాటి జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వైసీపీ నాయకుడు, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త కంగాటి లక్ష్మినారాయణ రెడ్డి అలియాస్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచ ్డరుడు బోయ సాంబశివుడుల జంట హత్యల కేసులో 11 మంది నిందితులపై జీవిత ఖైదు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ కర్నూలు ప్రిన్సిపుల్స్ సెషన్స్ న్యాయాధికారి జి.కబర్ధి గురువారం సంచలన తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు హత్య జరిగిన 2017 మే 21వ తేదీన చెరుకులపాడు నారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి వెల్దుర్తి మండలం పోసానిపల్లిలో ఒక పెళ్లికి హాజరై ఆ తర్వాత రామకృష్ణాపురంలో మరో పెళ్లికి హాజరయ్యేందుకు తన అనుచరులతో కలిసి రెండు వాహనాల్లో బయలుదేరారు. నారాయణరెడ్డి వాహనం క్రిష్ణగిరి రోడ్డులోని ఓ కల్వర్టు దగ్గర చేరుకుని, కల్లర్టు రిపేరి ఉండటంతో తమ ఫార్చునర్ కారును నెమ్మదిగా పోనిస్తుం డగా.. కాపు కాచిన నింది తులు పక్క పొలాల నుంచి రెండు ట్రాక్టర్లతో వచ్చి నారాయణరెడ్డి కారును వెనుక వైపు నుంచి, ముందు వైపు నుంచి ఢీ కొట్టాయి. దీంతో కారు నుజ్జయి ఆగిపోయాయి. పారిపో వడానికి యత్నించిన నారాయణరెడ్డిని మిగతా నిందితులు కారులో నుంచి బయటకు లాగారు.
అనంతరం నిందితులు కొడవళ్లు, కత్తులు, నాటు బాంబులతో దాడి చేయడంతో నారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడి కిందపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న నారాయణరెడ్డి తలపై నిందితులు పెద్ద బండరాయిని వేయడంతో ఆయన అక్కడే మృతి చెందాడు. అదే కారులో ప్రయాణిస్తున్న అనుచ రుడు బోయ సాంబశివు డును కూడా నిందితులు మారణాయుధాలతో అక్కడే నరికి హత్య చేశారు. నారాయణరెడ్డి కారు డ్రైవర్ గొల్ల కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసి 19 మంది నిందితులపై కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. చార్జ్‌షీటులో నిందితు లుగా ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు, టీడీపీ నాయకురాలు, వాల్మీకి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ పేర్లను కూడా చేర్చడంతో వారు ఉన్నత కోర్టులను ఆశ్రయిం చడంతో కోర్టు వారి ఇద్దరి పేర్లను కేసు నుంచి తొలగించింది. దీంతో మొత్తం 16 మందిపై కేసు విచారణ జరిగి... 29 మంది సాక్షులను కోర్టు విచారించింది.
కేసు విచారణ జరుగుతుండగానే ఏ4 నిందితుడు కోతుల ఆంజనేయులు మృతి చెందాడు. మిగిలిన 11 మంది నిందితులు కురువ రామాంజనేయులు, రామనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకట్రాముడు, గంటల శ్రీను, బీసన్నగారి రామాంజనేయులు, లక్ష్మన్న కుమారుడు బీసన్నగారి రామాంజనే యులు, బీసన్నగారి పెద్ద బీసన్నలపై కోర్టులో నేరం రుజువు కావడంతో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.వెంకటరెడ్డి వాదనలు వినిపించారు.
కోర్టులో మిన్నంటిన రోదనలు
చెరుకులపాడు నారాయణరెడ్డి జంట హత్య కేసులో 11 మంది నిందితులపై జీవిత ఖైదు శిక్ష పడిందని తెలియడంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణం వారి బంధువులు, కుటుంబీకుల రోదనలతో మార్మోగింది. గురువారం ఉదయం నుంచే నిందితుల కుటుంబ సభ్యులు, బందు వులు, పిల్లలు జిల్లా కోర్టుకు రావడంతో పోలీసు లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకు న్నారు. జీవిత ఖైదు పడిన వారిని పోలీసులు వాహనం లోకి ఎక్కిస్తుండగా.. ఒక్కసారిగా వారి భార్య పిల్లలు వారిని చూసి ఆక్రందనలు చేస్తూ పోలీసు వాహనానికి ఎదురొచ్చారు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు చొరవ చూసుకుని వాహనం వెళ్లేందు కు చర్యలు తీసుకోవడంతో నిందితులను పోలీసు లు కర్నూలు జైలుకు తరలించారు. శుక్రవారం కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
గట్టి బందోబస్తు
పత్తికొండ/ వెల్దుర్తి, మే 8(ఆంధ్రజ్యోతి): నారాయణరెడ్డి హత్యకేసులో కోర్టు 11 మందికి శిక్ష ఖరారు చేసిన నేపథ్యం లో చెరుకులపాడు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో సీఐ మధుసూదన రావు, ఎస్‌ఐ అశోక్ రిజర్వ్‌డ్ పోలీస్ బల గాలతో పహారా కాస్తున్నారు. వెల్దుర్తి, కోసనపల్లి, రామళ ్లకోట, గోవర్థనగిరి, క్రిష్ణగిరి మండలంలోని తొగర్చేడు, కంబా లపాడు, చిట్యాల, క్రిష్ణగిరి గ్రామాల్లో పోలీసులు పికెట్ ఏర్పాటుచేశారు.
కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి
నా భర్త నారాయణరెడ్డి హత్యకేసుకు సంబంఽ దించి కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తునాం. 2017లో నారాయణరెడ్డిని దారుణంగా హత్యచే శారు. హంతకులకు చట్టపరంగా శిక్ష పడాలని న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం. ఎనిమిదేళ్ల విచారణ అనంతరం 11 మందికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం హర్షిస్తున్నాం. ఈ తీర్పుతో కక్షలు, కార్పణ్యాలు పాల్పడే వారికి గుణపాఠంగా స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు భవిష్యత్తులో హత్యలు పాల్పడే వారికి భయానికి గురిచేస్తుంది. న్యాయం జరిగింది.