Share News

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:16 AM

గంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని బనగానపల్లె మాజీ సర్పంచ బీసీ రాజా రెడ్డి అన్నారు.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
మాట్లాడుతున్న మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి

మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి

ముగిసిన జాతీయ గంథ్రాలయ వారోత్సవాలు

బనగానపల్లె, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని బనగానపల్లె మాజీ సర్పంచ బీసీ రాజా రెడ్డి అన్నారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో జాతీయ గ్రంథా లయ వారోత్సవాల ముగింపు వేడుకులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి ఆధునిక ప్రపంచంలో గ్రంథాలయాల ప్రాముఖ్యత రోజురోజుకు తగ్గిపోతోందన్నారు. గ్రంథాలయ పితామహు డు గాడిచెర్ల సర్వోత్తమరావు విద్యావ్యవస్థను బాగు చేయాలనే సదు ద్దేశ్యంతో గ్రంథాల యాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచిం చారు. ఈసందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా వాణిజ్య విభా గం అధ్యక్షుడు టంగుటూరు శ్రీనయ్య, సొసైటీ చైర్మన అబ్దుల్‌కలాం, భరతుడు, ఇస్మాయిల్‌ఖాన, పణి, రిటైర్డు హెచఎం శ్రీరాములు, టీచర్‌ నాగరాజు, మల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం, అభిలాష్‌, మణి, గ్రంథాలయాధి కారి మధుశేఖర్‌ , అరుణగీతామణి, శరతబాబు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:16 AM