Share News

మట్టి వినాయకుడిని పూజిద్దాం

ABN , Publish Date - Aug 25 , 2025 | 01:05 AM

: మట్టి వినా యకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరిం చాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత నగర ప్రజలను కోరారు.

మట్టి వినాయకుడిని పూజిద్దాం
మట్టి వినాయకుడి విగ్రహాన్ని అందజేస్తున్న మంత్రి

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మట్టి వినా యకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరిం చాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత నగర ప్రజలను కోరారు. ఆదివారం నగరంలోని వెంకటేశ థియేటర్‌ పక్కనగల ప్రభుత్వ గో సంరక్షణశాలలో, గాయత్రి గోసేవ సమితి ఆధ్వర్యంలో, వేముల రమేష్‌ ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్ర మాన్ని మంత్రి టీజీ భరత ప్రారంభించి ప్రజలకు అందజేశారు. అలాగే నగరంలో పాతబస్టాండు సమీపంలోని వాసవీ ఏజెన్సీస్‌ అధినేత శేషఫణి ఏటా అందజేస్తున్న మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మంత్రి ప్రాంభించి, విగ్రహాలను ఉచి తంగా ప్రజలకు అందించారు. టీజీ భరత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో వినాయక చవితి నవరాత్రి ఉత్స వాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. టీజీవీ సంస్థల తర పున కర్నూలు నగరంలో మట్టి వినాయకుని విగ్రహాలే పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 01:05 AM