Share News

ఎయిడ్స్‌ రహిత జిల్లా సాధనకు కృషి చేద్దాం

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:08 AM

జిల్లాను ఎయిడ్స్‌ రహితంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ డా.సిరి సూచించారు. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ద్వారా కర్నూలుకు చేరుకున్న నూతన మొబైల్‌ ఐసీటీసీ వాహనాన్ని సోమవారం కలెక్టర్‌ ప్రారంభించారు.

ఎయిడ్స్‌ రహిత జిల్లా సాధనకు కృషి చేద్దాం
వాహనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ డా.సిరి

నూతన మొబైల్‌ ఐసీటీసీ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాను ఎయిడ్స్‌ రహితంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ డా.సిరి సూచించారు. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ద్వారా కర్నూలుకు చేరుకున్న నూతన మొబైల్‌ ఐసీటీసీ వాహనాన్ని సోమవారం కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లాలోని హై రిస్క్‌ ప్రాంతాలక వెళ్లి పరీక్షలు చేసేలా ప్రనాళిక రూపొందించాలని డీఎంహెచ్‌వో డా.ఎల్‌.భాస్కర్‌ను ఆదేశించారు. ప్రతి ఒక్కరు హెచ్‌ఐవీ పరీక్ష చేయించకుని వారి స్థితిని తెలుసుకోవాలన్నారు. సమస్య ఉన్న వారు జీవితకాలం మందులు వాడాలని సూచించారు. డీఎంహెచ్‌వో డా.ఎల్‌.భాస్కర్‌ మాట్లాడుతూ మొబైల్‌ వాహనం ద్వారా జిల్లాలో హెచ్‌ఐవీ, సుఖ వ్యాదులపై అవగాహన, కౌన్సెలింగ్‌, పరీక్షలు చేస్తామన్నారు. క డీఆర్వో వెంకటనారాయణమ్మ, డీసీహెచ్‌ఎస్‌ డా.ఎస్‌.జఫరుల్లా, డీఎంవో ఏ.నూకరాజు, ఏపీ సాక్స్‌ క్లస్టర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ అలిహైదర్‌, ఎస్‌వో దేవీశంకర్‌గౌడ్‌, క్లస్టర్‌ పీవో రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 01:08 AM