Share News

సమన్వయంతో పని చేద్దాం: మంత్రి బీసీ

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:50 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి వాటిని కైవసం చేసుకుందామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పిలుపునిచ్చారు.

సమన్వయంతో పని చేద్దాం: మంత్రి బీసీ
అంగనవాడీ చిన్నారులతో మాట్లాడుతున్న మంత్రి బీసీ

సంజామల, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి వాటిని కైవసం చేసుకుందామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంజామల టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాఽధ్యత టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు సముచితస్థానం ఉంటుందన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి : అర్హులందరికీ సం క్షేమ పథకాలు అందించాలని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారు లను ఆదేశించారు. మండల పరిషత కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అధికా రులు ప్రజలకు అందు బాటులో ఉండి సేవలు అందించాలన్నారు.

మౌలిక వసతులు కల్పించండి: సంజామల పెండేకంటి నగర్‌లో అధ్వానంగా ఉన్న అంగనవాడీ కేంద్రంలో 15రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ అధికారికి మంత్రి బీసీ ఆదేశించారు. సోమవారం ఆయన అంగనవాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పాలు, కోడిగుడ్లు ఇస్తున్నారా అని చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు విష్ణువర్ధన రెడ్డి, మూసాని చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రసాద రెడ్డి, విష్ణుశేఖర్‌ రెడ్డి, మోహన రెడ్డి, పసుపల మహమ్మద్‌, ఆకుమళ్ల సొసైటీ ఛైర్మెన ఉప్పలూరి మోహన రెడ్డి, పరమేశ్వర రెడ్డి, తిమ్మయ్య, ఎస్‌ఆర్‌బీసీ డిస్టిబ్యూటరీ వైస్‌ చైర్మన మల్కి హుసేన, మద్దిలేటి, సుబ్బారావు, రవి, మాధవ, బత్తుల ప్రతాప్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ గోవిందు, ఎంపీడీవో సాల్మన, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఏవో జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 11:50 PM