బాలల హక్కులను కాపాడుదాం
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:31 PM
బాలబాలికల హక్కులను కాపాడుదామని ఎన్‌సీపీసీఆర్ కమిషన్ సభ్యురాలు పద్మావతి పిలుపునిచ్చారు.
ఎన్‌సీపీసీఆర్ కమిషన్ సభ్యురాలు పద్మావతి
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బాలబాలికల హక్కులను కాపాడుదామని ఎన్‌సీపీసీఆర్ కమిషన్ సభ్యురాలు పద్మావతి పిలుపునిచ్చారు. నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో శుక్రవారం బాలల సమస్యలు, విద్యాహక్కు, పోక్సోచట్టం, బాలల హక్కుల చట్టంపై సమావేశం నిర్వహించారు. సభ్యురాలు పద్మావతి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ కమిటీలు, ఫిర్యాదులబాక్స్, ఈగల్‌క్లబ్స్, యాంటీ ర్యాగింగ్ కమిటీ, ప్రొటెక్షన్ కమిటీ, యువ, శక్తి కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అనాథ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. బనగానపల్లెలోని పాతబడిన బీసీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ హాస్టల్‌ను వారంలోపు అక్కడి నుంచి మార్చాలని ఆదేశించారు. పోక్సో బాధితులకు ఆసుపత్రిలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. బాల్యవివాహాల నిర్మూలను అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనాఽథ పిల్లలు ఉంటే జిల్లాలోని బాలల సంరక్షణ విభాగానికి తెలియజేయాలని, పిల్లలకు నెలకు రూ.4 వేలు అందుతాయని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ యుగంధర్‌బాబు, డీఈవో జనార్దన్‌రెడ్డి, డీఐఈవో శంకర్‌నాయక్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, డీసీపీవో స్వప్న ప్రియదర్శిని, సోషల్ వెల్ఫేర్ డీడీ చింతామణి, డిప్యూటీ డీఈవో శంకర్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.