Share News

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం: డీఈవో

ABN , Publish Date - May 24 , 2025 | 12:27 AM

: పర్యావరణాన్ని పరిరక్షిం చుకుందామని డీఈవో జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల డీవైఈవో కార్యాలయంలో జిల్లా ఎన్‌జీసీ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జీవ వైవిధ్య పోటీల్లో విజేతల బహుమతుల పంపిణీ కార్యక్ర మానికి డీఈవో జనార్దన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం: డీఈవో
విద్యార్థినికి ప్రశంసాపత్రం, షీల్డ్‌ను అందజేస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని పరిరక్షిం చుకుందామని డీఈవో జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల డీవైఈవో కార్యాలయంలో జిల్లా ఎన్‌జీసీ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జీవ వైవిధ్య పోటీల్లో విజేతల బహుమతుల పంపిణీ కార్యక్ర మానికి డీఈవో జనార్దన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా నంద్యాల డీవైఈవో శంకర్‌ప్రసాద్‌, డోన్‌ డీవైఈవో వెంకట్రా మిరెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి సుందర్‌రావు, జిల్లా సైన్స్‌ కోఆర్డినేటర్‌ కేవీ సుబ్బారెడ్డి పాల్గొ న్నారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు ప్రకృతిని ప్రేమిస్తూ మొక్కలను రక్షించి జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని సూచిం చారు. ప్రతి విద్యార్థికి ప్రకృతి వనరులపై అవగాహన ఉండాలన్నారు. భూమిపై ఉండే జంతు, జీవరాశులను రక్షించి తద్వారా మంచి గాలి, ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించాలన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జీవవైవిధ్యానికి మూలాధారం పచ్చదనమని, అందరం కలిసి మొక్కలు నాటి వాటిని పరరక్షించి పర్యావరణాన్ని కాపాడుదామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేషఫణి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:27 AM