సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదాం
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:03 AM
నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆర్‌సీఎం కర్నూలు బిషప్ గోరంట్ల జోహన్నెస్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం నంద్యాల చెక్‌పోస్టు వద్ద బిషప్ హౌస్‌లో క్రిస్మస్ వేడుకలకు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. బిషప్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, దైవ సేవకులు సహకరించుకోవాలన్నారు
ఆర్‌సీఎం బిషప్ గోరంట్ల జోహన్నెస్
కర్నూలు కల్చరల్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆర్‌సీఎం కర్నూలు బిషప్ గోరంట్ల జోహన్నెస్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం నంద్యాల చెక్‌పోస్టు వద్ద బిషప్ హౌస్‌లో క్రిస్మస్ వేడుకలకు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. బిషప్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, దైవ సేవకులు సహకరించుకోవాలన్నారు. నగరంలోని 250కి పైగా ఉన్న చర్చిల క్రైస్తవులతో కలిసి ఐక్య క్రిస్మస్ వేడుకలను నిర్వహించామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుత ప్రేమ, సేవ శ్వాసగా బతికిన క్రీస్తు ప్రభువు బోధనలను నుఉసరించాలన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ క్రీస్తు బైబిల్‌లో చెప్పిన విలువైన వాక్యాలను గుర్తు చేసుకుంటూ, పయనించాలని కోరారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ క్రైస్తవులు విద్య, వైద్య రంగాల్లో సమాజానికి అందించిన సేవలు మరువలేనివన్నారు. డిస్ట్రిక్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సయ్యద్ ఖలీద్, 19వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జి ప్రభాకర్ యాదవ్, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఛైర్మన్ బి. శ్రీరాములు ప్రభాకర్‌యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్‌చేసి పంపిణీ చేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, మహిళల కోలాట నృత్యం ఆకట్టుకున్నాయి.