Share News

రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమిద్దాం

ABN , Publish Date - May 26 , 2025 | 12:45 AM

ప్రజా వ్యతిరేక పాలకుల నుంచి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఎంఏ. గఫూర్‌ పిలుపునిచ్చారు.

రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమిద్దాం

సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఎంఏ గఫూర్‌

కర్నూలు న్యూసిటీ, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రజా వ్యతిరేక పాలకుల నుంచి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఎంఏ. గఫూర్‌ పిలుపునిచ్చారు. నగరంలోని కేకే భవన్‌లో ఆదివారం జరిగిన సీపీఎం జిల్లా స్థాయి విస్తుృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్‌, మతతత్వ అజెండాతో ఉద్యోగులు, కూలీలపై ఆర్థిక పీడనను పెంచి అప్పులయ్యేలా చేసి కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకునేలా చేసిందన్నారు. ఈ నేపథ్యంలో వర్గ, ప్రజా, సామాజిక పోరాటలను మరింత తీవ్రతరం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పీఎ్‌స రాఽధాకృష్ణ, జి.రామకృష్ణ, ఎండీ ఆనంద్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 12:45 AM