ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:25 AM
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
డోన టౌన, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ బూత, యూనిట్, క్లస్టర్ ఇనచార్జిలు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోట్ల స మావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ నియోజకవర్గంలోని బేతం చెర్ల, డోన, ప్యాపిలి మండలాల నుంచి కూటమి నాయకులు, అభిమానులు వేలాదిగా తరలిరావాలన్నారు. ప్రధాని రాకతో ఉమ్మడి జి ల్లాకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. డోన నుంచి వచ్చే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు దాదాపు 200 పైగా వాహనాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, అబ్జర్వర్ హరి, మున్సిపల్ వైస్ చైర్మన కోట్రికే హరికిషణ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన టీఈ కేశన్నగౌడు, టీడీపీ పట్టణ అధ్యక్షులు టీఈ రాఘవేంద్రగౌడు, లక్కసా గరం విజయ మోహన రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు వెంకటనాయు నిపల్లె శ్రీనివాసులు యాదవ్, మాజీ సర్పంచ పెద్దకేశవయ్యగౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, చిట్యాల మద్దయ్యగౌడు, జనసేన నాయకులు గడ్డం బ్రహ్మం, ఆలా మోహన రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడు, ఎంపీడీవో జి.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.