Share News

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేద్దాం

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:38 PM

: డిసెంబరు 13న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్క రించాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి పోలీసు అధికారులను ఆదేశించారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేద్దాం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి

కర్నూలు లీగల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 13న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్క రించాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక న్యాయ సేవాసదన్‌ భవనంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పోలీసు అఽధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి ల్లాలోని అన్నికోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్‌, రాజీకి వీలున్న క్రిమినల్‌, ఎక్సైజ్‌ కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేసుల పరిష్కారానికి కక్షిదారులను సంప్రదించి రాజీకీ వీలున్న కేసులను లోక్‌అదాలత్‌ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసులే గాక.. ప్రిలిటిగేషన్‌ కేసులను కూడా పరిష్కరించు కోవచ్చని కోర్టు మానిటరింగ్‌ పోలీసులు ఈమేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. పోక్సో కోర్టు న్యాయాధికారి రాజేంద్రబాబు, న్యాయాధికారులు అనిల్‌కుమార్‌, అపర్ణ, అనూష, పత్తికొండ, ఆళ్లగడ్డ డీఎస్పీలు వెంకట్రా మయ్య, ప్రమోద్‌కుమార్‌, కర్నూలు దిశా పీఎస్‌ సీఐ రామానాయుడు, ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:38 PM