Share News

సీఎం పర్యటనను విజయవంతం చేద్దాం

ABN , Publish Date - May 15 , 2025 | 12:29 AM

ఈనెల 17న పాణ్యం నియోజకవ ర్గానికి విచ్చేయనున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటనను విజ యవంతం చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సీఎం పర్యటనను విజయవంతం చేద్దాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): ఈనెల 17న పాణ్యం నియోజకవ ర్గానికి విచ్చేయనున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటనను విజ యవంతం చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మాధవీనగర్‌లోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ 16వార్డుల ఇనచార్జిలు, క్లస్టర్‌ ఇనచార్జిలతో గౌరు చరిత సమావేశమయ్యారు. శనివారం సీఎం చంద్రబాబు స్వఛ్ఛంద్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సి.క్యాంపు రైతుబజార్‌ కార్యక్రమం లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం 20వ వార్డు పరిధిలోని కేంద్రీ విద్యాలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల, కల్లూరు రూరల్‌, అర్బన వార్డుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరు కావాలని ఆమె పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కె.పార్వతమ్మ, పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌ యాదవ్‌, ఎనవీ రామకృష్ణ, శైలజా యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పీయూ మాదన్న పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:30 AM