Share News

నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుదాం

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:55 AM

కర్నూలు నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందిం చాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అధికారులను అదేశించారు.

నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుదాం
మాట్లాడుతున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు అర్బన్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందిం చాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అధికారులను అదేశించారు. శనివారం క్యాంప్‌ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. కమిషనర్‌ మాట్లాడుతూ జమ్మిచెట్టు, సంకల్‌ బాగ్‌, ఓల్డ్‌ పంప్‌ హౌస్‌ వద్ద ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేం దుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మరో ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా 5 పార్క్‌లను అభివృద్ధి చేయడం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి ప్రతిపా దనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మునగాలపాడు సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ను ఆయన పరిశీ లించారు. అక్కడ నగర పాలక సంస్థకు చెందని 135 ఎకరాల భూమిని సర్వే చేసి, రక్షణ వలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాధవీ నగర్‌ సమీపంలో తాగునీటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శేషసాయి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విశ్వేశ్వరరెడ్డి, ఏడీ విజయలక్ష్మి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈ గిరిరాజ్‌, నరేష్‌ గంగాధర్‌, కృష్ణలత పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:55 AM