Share News

రైతన్న మీ కోసం’ను విజయవంతం చేద్దాం: ఆర్డీవో

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:44 AM

మండలంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని డోన ఆర్డీవో నరసింహు లు, ఏడీఏ సునీత పిలుపునిచ్చారు.

రైతన్న మీ కోసం’ను విజయవంతం చేద్దాం: ఆర్డీవో
దొరపల్లిలో రైతులకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఆర్డీవో

డోన టౌన, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని డోన ఆర్డీవో నరసింహు లు, ఏడీఏ సునీత పిలుపునిచ్చారు. సోమవారం దొరపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు లబ్ధ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని చేపట్టింద న్నారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థకశాఖ అసి స్టెంట్లు, సచివాలయ అధికారులు, గ్రామ అభ్యుదయ రైతు సహకార సంఘం సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులతో గ్రామ కమిటీగా మూడు టీమ్‌లుగా ఏర్పడుతాయన్నారు. ఒక్కొక్క టీమ్‌ రోజు 30 మంది రైతుల ఇళ్లకు వెళ్లి నీటి భద్రత, డిమాండ్‌, ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసిసింగ్‌, ప్రభుత్వం నుంచి మద్దతు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డిసెంబరు 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహించి యాక్షన ప్లాన గురించి అవగాహన కల్పిస్తామని తెలి పారు. కార్యక్రమంలో వ్యవసా యాధికారి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌, పశుసంవర్థకశాఖ ఏడీ నాగరాజు, మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరెడ్డి, ఉద్యానశాఖ అధికారి కళ్యాణి, మార్కెటింగ్‌ సూపర్‌ వైజర్‌ శివకుమార్‌రెడ్డి, మండల విస్తరణ అధికారి మధు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:44 AM