మహానాడును విజయవంతం చేద్దాం
ABN , Publish Date - May 26 , 2025 | 12:46 AM
నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే మహానాడును విజయవంతం చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్, మే 25(ఆంధ్రజ్యోతి): నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే మహానాడును విజయవంతం చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పలువురు నాయకులకు మహానాడుకు హాజరు కావడానికి నాలుగు రకాల ఎంట్రీ పాసులను అందజేశారు. స్టేజీ పాసులు, వీవీఐపీ, వీఐపీ, వాహనాల పాసులను అందజేశారు. జిల్లాలోని నాయకులకు రాష్ట్ర కార్యాలయం పంపిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.