ప్లాస్టిక్ రహిత డోనగా తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:24 AM
డోనను ప్లాస్టిక్ రహితగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
డోన టౌన, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): డోనను ప్లాస్టిక్ రహితగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని 26వ వార్డు తారక రామనగర్‌లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. పట్టణంతోపాటు గ్రామాల్లో వీధిలైట్లు, స్తంభాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విద్యుత అధికారు లను ఆదేశించారు. ప్రజలు కూడా పట్టణంలో ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు వంటి వ్యర్థాలను కాలువల్లో, బయట వేయకుండా ప్రజలు సహకరిం చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి వారికి గృహాలు నిర్మించుకునే వారికి రూ.2.50లక్షలు ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన టీఈ కేశన్న గౌడు, వైస్ చైర్మన కోట్రికే హరికిషణ్, ఓబులాపురం శేషిరెడ్డి, మాజీ ఎంపీపీ శేషఫణి గౌడు, పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, దేవరబండ వెంకటనారా యణ గౌడు, మండల అద్యక్షుడు దశరథరా మిరెడ్డి, వంక వెంకటనారా యణ, ఆలేబాదు పరమేష్, గుండాల జయరా ముడు, లారీల బాషా, కంబలపాడు బ్రహ్మానందరెడ్డి, ధను, న్యాయవాది ఆంజనేయులు గౌడు, జయన్న యాదవ్, ఓంప్రకాష్ పాల్గొన్నారు.