Share News

ప్రజా సమస్యల పరిష్కారానికే ‘పల్లెకు పోదాం’

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:01 AM

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టిం దని డీఎంహెచవో డాక్టర్‌ శాంతికళ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ‘పల్లెకు పోదాం’
రికార్డును పరిశీలిస్తున్న డీఎంహెచవో శాంతికళ

డీఎం హెచవో డాక్టర్‌ శాంతికళ

కోడుమూరు రూరల్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టిం దని డీఎంహెచవో డాక్టర్‌ శాంతికళ అన్నారు. మండలంలోని లద్దగిరి గ్రామాన్ని డీఎంహెచవో శనివారం సందర్శించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రార్థనా సమావేశంలో విద్యార్థులకు ఆరోగ్యంపై తీసుకోవా ల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. అనంతరం బీసీ హాస్టల్‌లో వసతు లను ఆమె పరిశీలించారు. పాత్రలు శుభ్రంగా ఉంచుకుని ఆహారం తయారు చేయాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని వంట మనుషులకు సూచించారు. అలాగే స్థానిక పీహెచసీని తనిఖీ చేసి రికార్డులను పరి శీలించారు. వైద్యసేవలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని అంగనవాడీ కేం ద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన పట్టె కృష్ణ, తహసీల్దార్‌ నాగరాజు, వైద్యాధికారి జయంతి, డీహెచఈవో శ్రీనివాసయాదవ్‌, సీహెచవో శాంత పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 01:01 AM