Share News

సమస్యల పరిష్కారానికే ‘పల్లెకు పోదాం’

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:45 PM

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సమస్యల పరిస్కారం కోసం ‘పల్లెకు పోదాం’ చేపట్టినట్లు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా తెలిపారు.

సమస్యల పరిష్కారానికే ‘పల్లెకు పోదాం’
పర్లలో పర్యటిస్తున్న కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా

జిల్లాలోని 79 గ్రామాల్లో ప్రారంభం

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కల్లూరు, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సమస్యల పరిస్కారం కోసం ‘పల్లెకు పోదాం’ చేపట్టినట్లు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా తెలిపారు. శనివారం ఈకార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల పనితీరును పరిశీలించి జిల్లా మం డలానికి మూడు చొప్పున 79 గ్రామాల్లో స్పెషల్‌ ఆపీసర్లు పల్లెకుపోదాం కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు. పరిష్కరిం చాల్సిన సమస్యలను పల్లెకుపోదాం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచా లని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, హాస్పిటల్‌, గ్రామ సచివాల యం, ప్రభుత్వ బాలుర వసతి గృహం, రోడ్లు, నీటి సరఫరాను తనిఖీ చేశారు. పర్ల నుంచి చిన్నటేకూరు. సింగవరం వెళ్లే ఆర్‌ అండ్‌బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా మంజూరు చేశారు.

ఇద్దరు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసులు ..

ఓవర్‌హెడ్‌ స్టోరేజీ ట్యాంకులను కలెక్టర్‌ పరిశీలించి ప్రతిరోజూ క్లోరినేషన్‌ పరీక్షలు నిర్వహించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈని ఆదేశించారు. క్లోరినేషన్‌ పరీక్షలు సరిగా చేయలేదంటూ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నో టీసు జారీచేసి వివరణ కోరాలని కలెక్టర్‌ ఎంపీడీవోను ఆదేశించారు. పర్లలో ఈ-క్రాఫ్‌బుకింగ్‌ శాతం తక్కువగా ఉందని, పురోగతి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబరు 20 నాటికి ఈ-క్రాప్‌ బుకింగ్‌ పూర్తి చేయాలని విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి మండల ఫండ్‌ ద్వారా మరమ్మతులో ఉన్న భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Sep 06 , 2025 | 11:45 PM