Share News

6న ‘పల్లెకు పోదాం’ ప్రారంభం

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:14 PM

ఈ నెల 6వ తేదీన పల్లెకు పోదాం కార్యక్రమం ప్రారంభం కానున్నదని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను సూచించారు.

6న ‘పల్లెకు పోదాం’ ప్రారంభం
కలెక్టర్‌ రంజిత్‌ బాషా

యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 6వ తేదీన పల్లెకు పోదాం కార్యక్రమం ప్రారంభం కానున్నదని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వర్షాకాల పరిశుభ్రత, ఉపాధి హామీ, యూరియా లభ్యత, పీ-4, అన్నదాత సుఖీభవ, ఐవీఆర్‌ఎస్‌ తదితర అంశాలపై మండల స్పెషలాఫీసర్లు, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా 80మంది ప్రత్యేక అధికారులను నియమించారన్నారు. యూరియా బ్లాక్‌ మార్కెట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెంగీ, మలేరియా, చికెన్‌ గున్యా తదితర సీజనల్‌వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీసీలో జాయింట్‌ కలెక్టర్‌ డా.బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, సీపీవో భారతి పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:14 PM