Share News

బట్టమేక పక్షి తిరిగి వచ్చేలా ఏర్పాటు చేద్దాం

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:00 AM

బట్టమేక పక్షి తిరిగి రోళ్లపాడు అభయారణ్యంలోకి వచ్చేలా ఏర్పాటు చేద్దాం అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

బట్టమేక పక్షి తిరిగి వచ్చేలా ఏర్పాటు చేద్దాం
మాట్లాడుతున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

మిడుతూరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): బట్టమేక పక్షి తిరిగి రోళ్లపాడు అభయారణ్యంలోకి వచ్చేలా ఏర్పాటు చేద్దాం అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం మిడుతూరు మండలంబ రోళ్లపాడు అభయారణ్యం గెస్టుహౌస్‌ ఆవరణంలో సొసైటీ బస్టర్డు రికవరీ ప్రోగ్రామ్‌ అనే కార్యక్రమం వ్యవస్థాపకుడు మాండ్ర లింగా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాండ్ర లింగారెడ్డి మాట్లాడుతూ రోళ్లపాడు అరణ్యంలో కనుమరగైన బట్టమేక పక్షిని తిరిగి రప్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొంది స్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పక్షికి ఇక్కడ అనుకూలమైన గడ్డి మైదానం ఉండడం వల్ల 1986లో రోళ్లపాడు అభయారణ్యంలో బట్టమేక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బట్టమేక పక్షులు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో 150 మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు ఇక్కడికి వచ్చి పోతున్నాయన్నారు. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం, సోలార్‌, హైటెన్సన్‌ విద్యుత్‌ వైర్లు తదితర కారణాల వల్ల బట్టమేక పక్షులు ఇక్కడికి రావడం లేదన్నారు. కావున బట్టమేక పక్షులు మళ్లీ ఇక్కడికి వచ్చే విధంగా బస్టర్డు రికవరీ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేసినట్లు మాండ్ర లింగారెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్టాడుతూ రోళ్లపాడు అభయారణ్యంలో బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం మన అదృష్టమన్నారు. ప్రపంచంలోనే పేరుగాంచిన ఈ పక్షిని కాపాడు కోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకుపోయి రోళ్లపాడు అభయ అరణ్యంను అభివృద్ధి చేద్దామన్నారు. అనంతరం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ బట్టమేక పక్షికి ప్రసిద్ధిగాంచిన ప్రదేశం రోళ్లపాడు కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బాంబే బర్డు సైటిస్టు డాక్టర్‌ సుజిత్‌ నర్వాడే, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ వీరం ప్రసాద రెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌ రెడ్డి, కడియం వెంకటేశ్వర్లు యాదవ్‌, రామస్వామి రెడ్డి, సర్వోత్తమ రెడ్డి, వెంకటరామి రెడ్డి రవీంద్రబాబు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:00 AM