సాయి సన్మార్గంలో నడుద్దాం
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:02 AM
షిరిడీసాయి బాబా చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పిలుపునిచ్చారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి
డోన టౌన, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): షిరిడీసాయి బాబా చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పిలుపునిచ్చారు. దత్త జయంతి సందర్భంగా జాతీయ రహదారి పక్కన వెలసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, యువ నాయకుడు ధర్మవరం గౌతమ్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మంత్రిని ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బీసీ ఆలయంలో సాయిబాబాకు పూజలు చేసి హారతులిచ్చారు. ఆలయం సమీపంలో రూ.కోటి నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోట్రికే ఫణిరాజ్, వలసల రామకృష్ణ, లక్కసాగరం లక్ష్మీరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, సీఎం శ్రీనివాసులు, బెస్త కార్పొరేషన డైరెక్టర్ ప్రజా వైద్యశాల మల్లికార్జున, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, పీఆర్ ఏఈ నారాయణ, కాంట్రాక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణ, కమలాపురం సర్పంచ రేగటి అర్జున రెడ్డి, ఆలేబాదు పరమేష్, కందుకూరు పార్థసారధి పాల్గొన్నారు .