మోదీ సభను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:37 AM
16న కర్నూలులో ప్రధాని మోదీ బహిరంగసభను విజయవంతం చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పిలుపునిచ్చారు.
కల్లూరు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): 16న కర్నూలులో ప్రధాని మోదీ బహిరంగసభను విజయవంతం చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం దూపాడులో కల్లూరు అర్బన్ 16 వార్డులు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల, కల్లూరు మండలాలనాయకులతో సమావేశమయ్యారు. బహిరంగసభకు కూటమి నాయ కులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా కేంద్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ 2.0 సంస్కరణలు చేపట్టిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ , మంత్రి లోకేష్ జిల్లాకు రావడం శుభసూచకమన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్‌పర్శన్, కె.పార్వతమ్మ, డైరెక్టర్లు ఎస్‌కె.శ్రీనివాసరావు, పీబీవీ.సుబ్బయ్య, పెరుగు పురుషోత్తంరెడ్డి, సింగింల్‌విండో చైర్మన్లు ఈవీ.రమణ, డి.శేఖర్ పాల్గొన్నారు.
భోజనం సరిగాలేకపోవడంపై ఆగ్రహం
నగరంలోని బి.క్యాంపు జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాలలో ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉడికీ ఉడకని పప్పు, అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేయగా, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు మామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్‌బాషా, ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్, సరళ తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ సంస్కరణలతో వాహన ప్రియులకు మేలు జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలోని ఓ కార్ల షోరూంలో బుధవారం ఎమ్మెల్యే పాల్గొని యజమాని వెంకటేశ్వరరెడ్డిని కలిసి వివారలను ఆరా తీశారు. పియూ మాదన్న, కాసాని మహేష్‌గౌడ్, వాకిటి మాదేష్, దేవేందర్‌రెడ్డి, చెన్నయ్య, సోమశేఖర్‌రెడి పాల్గొన్నారు.