Share News

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:55 PM

స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, డా. బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దామని జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య పేర్కొన్నారు.

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం
నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత, జేసీ బి.నవ్య

జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, డా. బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దామని జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాయింట్‌ డైరెక్టర్‌ రంగ లక్ష్మీదేవి అధ్యక్షతన శనివారం స్థానిక ఐదు రోడ్ల కూడలి జంక్షన్‌లో డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్త గిరి, సాంఘిక సంక్షేమ అధికారి రంగలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య మాట్లాడుతూ జగ్జీవన్‌ రామ్‌ మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను కొని యాడారు. విద్యార్థి దశలోనే ఆయన సమాజంలో ఉన్న అస మానతలను గ్రహించి వాటికి ఎదురొడ్డి పోరాటం చేశారని అన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 11:55 PM