Share News

‘అల్లూరి’ స్ఫూర్తితో సేవ చేద్దాం

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:26 PM

స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ డా.బి. నవ్య అన్నారు.

‘అల్లూరి’ స్ఫూర్తితో సేవ చేద్దాం
నివాళులర్పిస్తున్న అధికారులు, సంఘం నాయకులు

ఇన్‌చార్జి కలెక్టర్‌ నవ్య

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ డా.బి. నవ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా యువజన సంక్షేమ, గిరిజన సం క్షేమ శాఖల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ నవ్య మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో మనం దేశభక్తిని మరింత పెంచుకోవాలన్నారు. ప్రజలకు మ రింతగా సేవలు చేయాలని సూచించారు. డీఆర్వో వెంకట నారాయణమ్మ, సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్‌, ఇన్‌చార్జి ట్రైబల్‌ ఆఫీసర్‌ (ఎస్‌డీసీ) కొండయ్య, కలెక్టరేట్‌ ఏవో శివరాముడు, టూరిజం అధికారి విజయ, సివిల్‌ సప్లయ్‌ డైరెక్టర్‌ మహేష్‌ నాయుడు, తహసీల్దార్‌ రమేష్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు గోవింద్‌ సింగ్‌, వెంకటేశ్వర్లు, శ్రీనాథ్‌, ఇంద్రాణి, ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు ఎరుకుల రాజు, కుశలన్న, హరి ట్రైబల్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రామరాజు, చంద్రప్ప, వెంకటేశ్‌, లంబాడ సంఘం నాయకులు యోగేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:26 PM