Share News

త్యాగమూర్తులను స్మరించుకుందాం

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:43 PM

త్యాగమూర్తులను స్మరించుకుందామని డోన డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు.

త్యాగమూర్తులను స్మరించుకుందాం
రక్తదానం చేస్తున్న దాతలతో డీఎస్పీ శ్రీనివాస్‌

డోన డీఎస్పీ శ్రీనివాసులు

డోన టౌన, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): త్యాగమూర్తులను స్మరించుకుందామని డోన డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని మంగ ళవారం పట్టణంలోని రైల్వేస్టేషన రోడ్డులో క్లబ్‌ హౌస్‌లో డీఎస్పీ ఆధ్వ ర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో విధి నిర్వహణలో 14 మంది అమరుల ఝయ్యారన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 522 మంది రక్తదానం చేశారు. వారందరికీ ప్రశంసాపత్రాలు, పండ్లు అంద జేశారు. కార్యక్రమంలో అర్బన సీఐ ఇంతియాజ్‌ బాషా, రూరల్‌ సీఐ రాకేష్‌, బేతంచెర్ల, బనగానపల్లె, ప్యాపిలి సీఐలు, ఎస్‌ఐలు శరత కుమార్‌ రెడ్డి, మమత పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 11:43 PM