Share News

అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:37 AM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దామని దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం
చాగలమర్రిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న దళిత సమాఖ్య నాయకులు

దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లయ్య

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అంబేడ్కర్‌కు ఘన నివాళి

చాగలమర్రి/బనగానపల్లె, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దామని దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య అన్నారు. బుధవారం స్థానిక కేరళ వైద్యశాలవద్దగల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బనగానపల్లె పట్టణంలోని కస్బా ప్రాథమిక పాఠశా లలో బుధవారం పాఠశాల హెచఎం సుంకన్న ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ మండలంలోని పలు గ్రామాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ జ్యోతి రత్నకుమారి, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కిషోర్‌, మండల పరిషత కార్యాలయంలో ఎంపీడీవో నూర్జాహానలు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, అంబేడ్కర్‌ సర్కిల్‌ దగ్గర, ఎస్సీ కాంప్లెక్స్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొలిమిగుండ్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. రుద్రవరంలోని సమావేశ భవనంలో ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. డోన పట్టణంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, నెహ్రూ నగర్‌ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్‌ తోగాట సురేష్‌బాబు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బేతంచెర్ల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యుత సబ్‌ స్టేషన లో అధికారులు, సిబ్బంది అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

Updated Date - Nov 27 , 2025 | 12:37 AM